Skip to main content

Namaste NRI

నేను రెడీ నుంచి మస్తుగుందిరా యవ్వారం సాంగ్ రిలీజ్

యంగ్‌ హీరో హవీష్‌ కథానాయకుడిగా, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ నేను రెడీ. సత్యనారాయణ కోనేరు సమర్పణలో, నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్‌ కథానాయిక. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించగా, తాజాగా చిత్రంలోని మస్తుగుందిర యవ్వారం అంటూ తెలంగాణ స్లాంగ్‌లో సాగే పాటను వరంగల్‌ శాసన సభ్యులు నాయని రాజేందర్‌ రెడ్డి చేతుల మీదుగా హనుమకొండలోని కాళోజి కళా క్షేత్రం వేదికగా ఘనంగా విడుదల చేశారు.

కాశర్ల శ్యామ్‌ రాసిన ఈ పాటను మిక్కీ జే మేయర్‌ స్వరపరిచారు. అందమైన విజువల్స్‌తో పాటు హీరో హవీష్‌, హీరోయిన్‌ కావ్య థాపర్‌ కెమిస్ట్రీ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హవీష్‌ను కొత్తగా చూపిస్తూ తనదైన శైలిలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా త్రినాథరావు నక్కిన ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని, కామెడీ, రొమాన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలు కూడా ఈ చిత్రంలో ఉంటాయని చిత్రబృందం తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events