శ్రీలంక ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిన నేపథ్యంలో పలు దేశాల్లోని తమ రాయబార కార్యాలయాలను తాత్కాలికంగా మూసేస్తున్నట్లు ప్రకటించింది. నార్వే రాజధాని ఓస్లో, ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని రాయబార కార్యాలయాలను తాత్కాలికంగా మూసేస్తున్నట్లు పేర్కొంది. వీటితో పాటు సిడ్నీలోని వాణిజ్య రాయబార కార్యాలయాన్ని కూడా తాత్కాలికంగా మూసేస్తున్నట్లు శ్రీలంక విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు నిండుకోవడంతో శ్రీలంక దారుణమైన ఆర్థిక సంకోభం ఎదుర్కొంటున్నది. నిత్యావసర వస్తువుల కొరతతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో అధికార కూటమిలో విభేదాలు చోటు చేసుకోవడం గమనార్హం.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)