Namaste NRI

శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం..రెండు వారాల పాటు

శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు రెండు వారాల పాటు షట్‌డౌన్‌ ప్రకటించింది. దేశంలో చమురు నిల్వలు, నిండుకున్న నేపథ్యంలో ఆయిల్‌ను ఆదా చేసేందుకు అత్యవసర మినహా బడులు, ప్రభుత్వ కార్యాలయాలు మూసేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రపు సిబ్బందితో పనిచేస్తున్నాయి. 

                         అధ్యక్షుడు గొటబయ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ కొలంబోలోని అధ్యక్ష కార్యాలయాన్ని ముట్టిడిరచారు.  అధ్యక్షుడి కంటే పార్లమెంట్‌కు ఎక్కువ అధికారులు ఉండేలా ప్రతిపాదిత 21 రాజ్యాంగ సవరణకు శ్రీలంక క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇది త్వరలో పార్లమెంట్‌ ముందుకు రానున్నదని మంత్రులు తెలిపారు. దేశ ప్రధాని రణిల్‌ విక్రమ సింఘే ఐఎంఎఫ్‌ బృందంతో చర్చలు జరిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events