అమెరికా అధ్యక్ష భవనానికి క్రిస్మస్ చెట్టు రాకతో అగ్రరాజ్యంలో హాలిడే సీజన్ ఆరంభమైంది. ప్రథమ పౌరురాలు జిల్ బైడెన్ దీన్ని అధికారికంగా ప్రారంభించారు. కుటుంబ సభ్యులతో కలిసి నాన్టు కెట్ ద్వీపానికి చేరుకున్న అధ్యక్షుడు జో బైడెన్ ప్రస్తుతం అక్కడున్న తన చిరకాల మిత్రుడు, వ్యాపారవేత్త డేవిడ్ రూబెన్‌స్టీన్ ఇంట్లో బస చేస్తున్నారు. వాషింగ్టన్ నుంచి బయల్దేరి వెళ్లడానికి ముందు జో బైడెన్ దంపతులు, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దంపతులు పేదల కోసం డీసీ సెంట్రల్ కిచెన్ లో వంటలు వండి, వడ్డించారు.