అల్లరి నరేష్ తాజా సినిమా ప్రకటన వెలువడింది. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మించనున్న ఈ చిత్రానికి సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తారు. లవ్, ఎమోషన్స్, యాక్షన్ అంశాల కలబోతగా సాగే కథాంశమిదని, నరేష్ పాత్ర నవ్యరీతిలో ఉంటుందని దర్శకుడు తెలిపారు. 1990 దశకం నేపథ్యంలో జరిగే కథ ఇదని, సెప్టెంబర్ నెలాఖరులో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తామని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రిచర్డ్ ఎమ్ నాథన్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, నిర్మాతలు: రాజేష్ దండా, బాలాజీ గుత్తా, కథ, మాటలు, దర్శకత్వం: సుబ్బు మంగదేవి.