బూస్టర్ డోసు ఇవ్వాలని స్వీడెన్ ప్రభుత్వం నిర్ణయించింది. 80 ఏళ్లు దాటిన వృద్ధులకు బూస్టర్ డోసు ఇవ్వాలని ఆరోగ్య శాఖ సూచించింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఒక్కొక్కరికీ మొత్తం నాలుగు కరోనా డోసులు ఇచ్చినట్టవుతుంది. తొలి బూస్టర్ డోసు తీసుకున్న రెండు నెలలకు రెండో బూస్టర్ డోసు ఇవ్వాలని అక్కడి అధికారులు సూచించారు. మోడర్నా లేదా ఫైజర్ టీకాలకు చెందిన బూస్టర్ డోసులు మాత్రమే ఇవ్వాలని తేల్చి చెప్పారు. ఒమిక్రాన్ నేపథ్యవంలో వయోజనుల్లో రోగనిరోధక శక్తి బలోపేతం చేసే దిశగా ఈ సూచన చేసింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/modi-300x160.jpg)