ప్రపంచంలోనే అతి ఎత్తైన మొబైల్ థియేటర్ లద్దాఖ్‌లో ప్రారంభమైంది. సముద్ర మట్టానికి సుమారు 11,562 అడుగుల ఎత్తులో, తక్కువ ఖర్చుతో అన్ని రకాల సౌకర్యాలతో ఈ మొబైల్ థియేటర్‌ను నెలకొల్పారు. మారుమూల గ్రామాల ప్రజలు సైతం సినిమాకు దగ్గర కావాలనే ఉద్దేశంతో ఈ థియేటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పిక్చర్ టైమ్ ఫౌండర్, సీఈవో సునీల్ తెలిపారు. ఈ థియేటర్‌లో అక్షయ్ కుమార్ నటించిన బెల్‌బాటమ్ చిత్రాన్ని తొలిసారి ప్రదర్శించారు. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. లదాక్‌లోని లేప్‌ాలో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే ఎత్తైన మొబైల్ థియేటర్‌లో బెల్‌బాటమ్ చిత్రాన్ని ప్రదర్శించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. దీనితో నా మనసు నిండిపోయింది అని ట్వీట్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి రంజిత్ ఎం.తివారీ దర్శకత్వం వహించారు. వాణీకపూర్, లారా దత్త కీలక పాత్రలు పోషించారు.