పెనమలూరు మండలం, గోసాల గ్రామానికి చెందిన శ్రీ పోతురాజు రమేష్ గారు ఇటీవల మరణించడంతో తానా అధ్యక్షులు శ్రీ లావు అంజయ్య చౌదరి గారు,ఫౌండేషన్ చైర్మన్ శ్రీ యార్లగడ్డ వెంకటరమణ గారు, తానా ఫౌండేషన్ ట్రస్టీ చేయూత కోఆర్డినేటర్ శశికాంత్ వల్లేపల్లి గారి ఆధ్వర్యంలోమీడియా సమన్వయకర్త శ్రీ మల్లినేని ఠాగూర్ గారి ఆర్ధిక సౌజన్యంతో,పెనమలూరు నియోజకవర్గ TDP ఇంచార్జీ శ్రీ బోడె ప్రసాద్ గారి చేతుల మీదుగా 50 వేల రూపాయిల చెక్కును గోసాల గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు.