రాజ్ తరుణ్ హీరోగా ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తిరగబడరసామీ. మల్కాపురం శివ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రం టీ-జర్ విడుదల చేశారు. దిల్ రాజు మాట్లాడుతూ ఈ టీ-జర్ చూస్తుంటే అండర్ ప్లే పాత్ర చేసి ఫైనల్ గా తిరగబడరసామీ అని క్లైమాక్స్ లో ఇరగదీసినట్లు అర్ధమవుతుంది రాజ్ తరుణ్, రవి కుమార్ కమ్ బ్యాక్. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.
నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ నేను చేసిన చిత్రాల్లో సూర్య వెర్సస్ సూర్య నా మనసుకు దగ్గరైన చిత్రం. ఆ టీం తో మరో పది సినిమాలు చేయడానికి సిద్ధంగా వుంటాను. అదే విధంగా ఈ సినిమా టీంతో కూడా రెడీగా వుంటాను. కొబ్బరికాయ కొట్టినప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో గుమ్మడి కాయ కొట్టినప్పుడు కూడా అదే సంతోషం వుంటే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని తెలిపారు.
ఏఎస్ రవికుమార్ చౌదరి మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత నాకు మళ్ళీ రీబర్త్ ఇస్తున్న మా నిర్మాత శివకుమార్ గారికి ధన్యవాదాలు అని తెలిపారు. హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ దర్శకుడు రవికుమార్ చౌదరి గారు ఈ సినిమాతో నాలో కొత్త కోణం చూపించారు. నేను చిన్నచిన్నగా తప్పితే యాక్షన్ పెద్దగా ఎపుడూ చేయలేదు అన్నారు. ఈ కార్యక్రమంలో బెక్కం వేణుగోపాల్, మన్నారా చోప్రా , దర్శకుడు సముద్ర, తాగుబోతు రమేష్ తదితరులు పాల్గొన్నారు.