Namaste NRI

తెలుగు టైటాన్స్ ఘోర పరాజయం

ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)లో గుజరాత్‌ జెయింట్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ మరో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఈ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కిది ఆరో ఓటమి. టైటాన్స్‌`గుజరాత్‌ జెయింట్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌ 18 పాయింట్లు తేడాతో ఓటమిపాలైంది. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లోనూ గెలవని టైటాన్స్‌ జట్టు 22`40 తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌ చేతిలో ఓడిపోయింది. గుజరాత్‌ ఆలౌరౌండర్‌ రాకేశ్‌ 16 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో యూ ముంబాపై పట్నా పైరెట్స్‌ ఘన విజయం సాధించింది. పట్నా పైరెట్స్‌ 43`23 తేడాతో యు ముంబాను ఓడిరచింది. కాగా లీగ్‌ పాయింట్ల పట్టికలో 34 పాయింట్లతో పట్నా అగ్రస్థానంలో ఉండగా ఢల్లీి(32), బెంగళూరు (28) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. టైటాన్స్‌ ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఆరు ఓడి, రెండు మ్యాచ్‌లు టై చేసుకుని 10 పాయింట్లతో చివరి 12వ స్థానంలో కొనసాగుతుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events