Namaste NRI

TTA సేవా డేస్ మూడవ రోజు ముత్యాలమ్మ గుడి ప్రారంభం, పేదలకు దుప్పట్లు పంపిణీ

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ TTA సేవ డేస్ కార్య క్రమాలు అట్టహాసం గా జరుగుతున్నాయి. మొదటి రోజు ప్రభుత్వ పాటశాలలో మెడికల్ క్యాంపు, రెండవ రోజు హైదరబాద్ T-HUB లో సెమినార్ కార్యక్రమం నిర్వహించారు. మూడవ రోజు దేవర కొండ దగ్గర పెండ్లిపాకుల గ్రామం లో ముత్యాలమ్మ దేవాలయం ను ప్రారంభించారు. TTA ఎథిక్స్ కమిటీ డైరెక్టర్ శ్రీ గణేష్ వీరమనేని సొంత గ్రామం ఇది. వీరి తండ్రి గారైన వీరమనేని మాధవ రావు గారు ఈ దేవాలయ నిర్మాణం లో ప్రదాన దాత గా ఉంటూ దగ్గరుండి నిర్మించారు. ఇదే గ్రామంలో వున్న పేద ప్రజలకు చలికి దుప్పట్లను పంపిణీచేశారు. ఈ సందర్భంగా గణేష్ వీరమనేని మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజలకు TTA సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. TTA ప్రెసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల మాట్లాడుతూ దేవాలయం ప్రారంభించడం గ్రామ ప్రజలకు తమ వంతు సాయం చేయడం ఆనందం గా వుందన్నారు. TTA ప్రెసిడెంట్ ఎలక్ట్ నవీన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామానికి మరిన్ని కార్యక్రమాలు చేయాలని వుందని అన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం లో పాల్గొన్నందుకు tta టీమ్ ఆనంద గా వుందన్నారు. తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అనే నినాదంతో 2015 లో తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్థాపించబడినది .


తెలంగాణ తరుపున విదేశాలలో ఏర్పడిన మొట్టమొదటి సాంస్కృతిక సంస్థ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్.TTA founder Pailla Malla Reddy Garu, Advisory Consul chair – Vijayapal reddy గారు,Co-chair – Mohan Patlolla గారు, Member: Bharat Madadi గార్ల ఆధ్వర్యంలో 2015 లో మొదలై , ప్రస్తుత ప్రసిడెంట్ వంశిరెడ్డి కంచరకుంట్ల గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో సేవాకార్యక్రమాలతో దూసుకుపోతున్న తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ తెలుగు రాష్ట్రాలలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సేవ డేస్ కార్యక్రమాన్ని ఈసంవత్సరం కూడా నిర్వహించ తలపెట్టింది . ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ప్రెసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల మరియు ప్రసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మలిపెద్ది గారు ,సేవాడేస్ కార్యక్రమానికి కోఆర్డినేటర్ సురేష్ రెడ్డి వెంకన్నగారి గారు ప్రజలను కోరారు .

Shri. Ramesh Loganathan Professor CoInnovation/Outreach at IIIT Hyderabad …. గారు Eco సిస్టమ్ గురించి వివరించారు…భారత్ లో జరుగుతున్న అనేక రీసెర్చ్ ల గురించి వివరించారు. సేవాడేస్ కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా సురేష్ రెడ్డి వెంకన్నగారి గారు ,INDIAN కోఆర్డినేటర్ గా డా : డి . ద్వారకనాథ రెడ్డి గారు ,కో – కోర్డినేటర్ గా దుర్గా ప్రసాద్ సెలోజ్ గారు ,ఫౌండేషన్ సర్వీస్ చైర్ గా సంతోష్ గంటారం గారు ,ఇంటెర్నేషనల్ వైస్ ప్రసిడెంట్ గా ప్రసాద్ కునారపు గారు ,హెల్త్ అండ్ వెల్నెస్ అడ్వైసర్ గా జ్యోతిరెడ్డి దూదిపాల గారు ,నర్సింహా పెరుక గారు – కమ్యూనిటీ సర్వీసెస్ చైర్ గా , ప్రసిడెంట్ గా వంశిరెడ్డి కంచరకుంట్ల గారు మరియు ప్రసిడెంట్ ఎలెక్ట్ గా నవీన్ రెడ్డి మలిపెద్ది గారు ,Kavitha Reddy – General Secretary గారు భాద్యతలు నిర్వహిస్తున్నారు. మరియు TTA సభ్యులు సేవా డేస్ లో పాల్గొనడం జరిగింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events