విష్యక్ సేన్ కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్వకత్వంలో తెరకెక్కినస్తున్న పాన్ ఇండియా చిత్రం దాస్ కా ధమ్కీ. నివేద పేతురాజ్ కథానాయిక. కరాటే రాజు నిర్మాత. ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు విడుదల తేదీతో కూడిన కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో విష్వక్ చేతి కర్ర పట్టుకొని సీరియస్‌గా నడిచొస్తూ కనిపించారు. రావు రమేష్, రోహిణి, పృధ్వీరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో నిండిన రొమాంటిక్ కామెడీ చిత్రమిది. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: వియోన్ జేమ్స్, కూర్పు: అన్వర్ అలీ, ఛాయాగ్రహనం : దినేష్ కె.బాబు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
