దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్రమోడీ ఇదివరకు ప్రకటించినట్టుశనివారం కాకుండా ఆదివారం (9న) ప్రమాణస్వీకారం చేయనున్నారు. కర్తవ్యప థ్‌లో ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తరువాత మూడోసారి ప్రధానిగా ప్ర మాణస్వీకారం చేసే అవకాశం మోడీకే లభించింది. ఈ సందర్భంగా ఈ మహోత్సవానికి విదేశీ నేతలు హాజరుకానున్నారు.
పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ అధినేతలకు మన ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు అందాయి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షులు రణిల్ విక్రమ్ సింఘే, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ , భూటాన్ ప్రధాని షెరింగ్ తొబ్‌గే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్‌నాథ్‌లకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి.