Namaste NRI

వార్‌-2 ట్రైలర్‌ వచ్చేది.. ఆరోజే

హృతిక్‌రోషన్‌, ఎన్టీఆర్‌ కలిసి నటిస్తున్న స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ వార్‌-2. కియారా అద్వాణీ కథానాయిక.  అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్‌ ప్రమోషన్స్‌ కు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నెల 25న ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ తేదీకి ఎంతో ప్రత్యేకత ఉందని, ఎన్టీఆర్‌, హృతిక్‌రోషన్‌ ఈ ఏడాదితో సినీరంగంలో 25ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నార ని, ఈ అరుదైన క్షణాలను మరింత గొప్పగా సెలబ్రేట్‌ చేసుకోవడానికి 25న ట్రైలర్‌ను రిలీజ్‌ చేయబోతున్నామని మేకర్స్‌ తెలిపారు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ మాజీ రా గూఢచారి పాత్రలో కనిపించనున్నారు. టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ రావడంతో ట్రైలర్‌ గురించి ఇద్దరి హీరోల అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.  ఆగస్ట్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events