Namaste NRI

డంకీ ట్రైలర్‌ వచ్చేసింది

హ్యాట్రిక్ కొట్టేందుకు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ రెడీ అవుతున్నాడు. పఠాన్, జవాన్ లతో బాలీవుడ్ ను షేక్ చేసిన షారుఖ్, డంకీతో హ్యాట్రిక్ ను అందుకుంటాడని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్, 3 ఇడియట్స్, పీకే, సంజూ వంటి భారీ సూపర్ హిట్లు ఇచ్చిన రాజ్ కుమార్ హీరానీ దర్శకత్వంలో రూపొందడంతో డంకీపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రభాస్ సినిమా సలార్ కు డంకీ పోటీగా వస్తున్నా తగ్గేదేలే అంటోంది డంకీ యూనిట్. అక్రమ వలసల నేపథ్యంలో డంకీ రూపొందడం విశేషం. కథ కాస్త సీరియస్ గా ఉండే అవకాశాలున్నా, కామెడీ విషయంలో రాజ్ కుమార్ హీరానీ ఏమాత్రం తగ్గలేదట. తాజాగా రిలీజైన డంకీ ట్రైలర్ లో కూడా కామెడీకే పెద్దపీట వేశారు. ఈ ట్రైలర్ బాలీవుడ్ బాద్ షా అభిమానుల్ని ఉర్రూతలూగిస్తోంది.

ఇక డ్రామా, రొమాన్స్ జాన‌ర్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌లో హిరానీ, గౌరీ ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బోమన్ ఇరానీ, విక్కీ కౌశల్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 22న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events