Skip to main content

Namaste NRI

సుకుమార్‌ కూతురు నటించిన గాంధీ తాత చెట్టు .. ట్రైలర్‌ వచ్చేసింది

ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది దర్శకురాలు. నవీన్‌ ఏర్నేని, యలమంచిలి రవిశంకర్‌, శేష సింధురావు నిర్మాతలు. జనవరి 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను అగ్ర నటుడు మహేష్‌బాబు విడుదల చేశారు. అందరి మనసులకు హత్తుకునే సినిమా ఇదని, సుకృతివేణితో పాటు టీమ్‌ అందరికి మహేష్‌బాబు  అభినందనలు తెలిపారు.

గాంధీ సిద్ధాంతాలను పాటిస్తూ ఆయన బాటలో నడిచే ఓ పాఠశాల విద్యార్థిని తన తాతకు ఇష్టమైన చెట్టును, ఊరిని ఎలా రక్షించుకుందనే సందేశాత్మక ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించారని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతున్నది. ప్రపంచమంతటా అసూయద్వేషాలు పెరిగి పోయిన ప్రస్తుత తరుణంలో గాంధీజీ సిద్ధాంతాలను పాటించే ఓ పద మూడేళ్ల అమ్మాయి కథగా ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని దర్శకురాలు పద్మావతి మల్లాది పేర్కొన్నా రు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీజిత్‌ చెర్వుపల్లి, సంగీతం: రీ, రచన-దర్శకత్వం: పద్మావతి మల్లాది.

Social Share Spread Message

Latest News