Namaste NRI

ఆకట్టుకుంటోన్న రాఘవ రెడ్డి ట్రైలర్

శివ కంఠమనేని, రాశి, నందితాశ్వేత ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం రాఘవ రెడ్డి. సంజీవ్‌ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. రాఘవ రెడ్డి ట్రైలర్‌ను గమనిస్తే, పక్కా మాస్‌ అండ్‌ కమర్షియల్‌ ఫార్మేట్‌ ఎలిమెంట్స్‌తో తెరకెక్కింది. సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ అయిన కథానాయకుడు.. తప్పు జరిగితే సహించని అతని వ్యక్తిత్వం కారణంగా డ్యూటీ పరంగా మంచి పేరు తెచ్చుకుంటాడు. అయితే వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలేంటి? నిజాయతీగా ఉండటం వల్ల తను ఏం పోగొట్టుకున్నాడు? డ్యూటీలో తనెంత సిన్సియర్‌గా ఉంటాడు. విలన్స్‌ని హీరో ఎలా భరతం పడతాడు, ఇలాంటి ఎమోషనల్‌, యాక్షన్‌ అంశాలతో రాఘవరెడ్డి సినిమాను తెరకెక్కించారని అర్థమవుతుంది. శివ కంఠనేని, రాశి, నందితా శ్వేత, పోసాని, అజయ్ ఘోష్‌, అజయ్, రఘుబాబు, శ్రీనివాస్‌ రెడ్డి వంటి స్టార్స్‌ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. సంజీవ్‌ మేగోటి – సుధాకర్‌ మారియో సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రానికి ఎస్‌.ఎన్‌.హరీష్‌ సినిమాటోగ్రఫీ అందించారు. కె.వి.రమణ ఆర్ట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశారు. జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events