సుహాస్, కార్తీక్త్న్రం, రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం శ్రీరంగనీతులు. ప్రవీణ్ కుమార్ వీఎస్‌ఎస్ దర్శకుడు. వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మాత. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇది మనందరి కథ, మన జీవితాల్ని తెరపై చూసుకున్న అనుభూతి కలుగుతుందని దర్శకుడు చెప్పారు. ఈ సినిమాకు కథే హీరోనని, బస్తీ నుంచి బంగళా వరకు అందరికి కనెక్ట్ అవుతుందని విరాజ్ అశ్విన్ అన్నారు. యువతరం ఆలోచనలను ప్రతిబింబిస్తుందని, తప్పకుండా విభిన్న చిత్రమవుతుందని నిర్మాత తెలిపారు. ఇదొక ఆంథాలజి చిత్రమని, కథలో కొత్తదనం అందరికీ నచ్చుతుందని సుహాస్ చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 11న సినిమా విడుదల కానుంది.