హీరో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్నచిత్రం డీజే టిల్లు. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌గా టిల్లు స్వేర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మల్లిక్ రామ్ దర్శకత్వం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. మార్చి 29న ప్రేక్షకుల ముందుకురానుంది. వాలెంటైన్స్ డేను పురస్కరించుకొని ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రేయసి రాధిక కారణంగా చిక్కుల్లో పడ్డ టిల్లు, సీక్వెల్‌లో కూడా అదే తరహా సమస్యలను ఎదుర్కొంటూ కనిపించారు. ఆద్యంతం హాస్య ప్రధానంగా ఊహించని ట్విస్ట్‌లతో ట్రైలర్ ఆసక్తిని పెంచింది. తొలి భాగం కంటే రెట్టింపు వినోదంతో ఈ సినిమాను తెరకెక్కించామని, ఇప్పటికే విడుదలైన పాటలు వైరల్ అవుతున్నాయని, టిల్లు పంచే వినోదం ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయిప్రకాష్ ఉమ్మడిసింగు, సంగీతం: రామ్ మిరియాల.