Namaste NRI

యూఏఈ ప్రభుత్వం తీపి కబురు

భారత ప్రయాణికులకు  యూఏఈ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. యూఏఈ నుంచి భారత ప్రవాసులు కేవలం రూ.10వేలకే స్వదేశానికి రావొచ్చు. పైగా 200కేజీల వరకు లగేజీ కి కూడా అనుమతి ఉంటుంది. దీనికోసం దక్షిణాది రాష్ట్రమైన కేరళ కు యూఏఈ నుంచి షిప్ సర్వీస్ నడపనుంది. దీని ద్వారా చాలా తక్కువ ఖర్చుతో భారతీయులు స్వదేశానికి వచ్చే వెసులుబాటు కలుగుతుంది. ఇన్నాళ్లు భారీగా ఉన్న విమాన చార్జీలతో బెంబెలెత్తిపోయిన మనోళ్లకు ఇది నిజంగా గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఈ ఏడాది చివరినాటికి ఈ షిప్ సర్వీస్‌ ను ప్రారంభించాలని యూఏఈ యోచిస్తోంది. ఈ సర్వీస్ ద్వారా భారతీయులు కేరళకు దాదాపు మూడు రోజుల్లోనే చేరుకోవచ్చని ఇండియన్ అసోషియేషన్ షార్జా అధ్యక్షుడు వైఏ రహీం తెలిపారు. డిసెంబర్‌లో స్కూళ్ల సెలవులకు ముందు సర్వీస్‌ను ప్రారంభించాలనే ఆలోచన ఉంది.

 యూఏఈలోని భారతీయ ప్రవాసులు అధిక విమాన ఛార్జీలు చెల్లించకుండా వారి స్వస్థలాలకు వెళ్లేలా ప్రణాళికలు రూపొందించాం అని అన్నారు. ప్రాజెక్ట్ గురించి చర్చించేందుకు కేరళ ప్రభుత్వ ప్రతినిధులు సెప్టెంబర్ 24న భారత కేంద్ర ప్రభుత్వ మంత్రులను కలుస్తారని పేర్కొన్నారు. ఈ భేటీ అనంతరం తాము నవంబర్ నాటికి సర్వీస్ ట్రయల్ రన్ చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events