2024 ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. గతంలో జరిగిన అధ్యక్ష ఎన్నికలపై విమర్శలు గుప్పించిన డోనాల్డ్, మరోసారి 2020 ఎన్నికల అంశాన్ని లేవనెత్తారు. 2020 ఎన్నికలు భారీ మోసం అని పేర్కొన్న ట్రంప్, అమెరికా రాజ్యాంగాన్ని రద్దు చేయాలని పిలుపునిచ్చారు. తనకు వ్యతిరేకంగా బడా టెక్ కంపెనీలు డెమోక్రాట్లతో జతకట్టాయని ఆరోపించారు. తన సోషల్ మీడియా నెట్‌వర్క్ యాప్ ట్రూత్ పోస్ట్‌లో 2020 ఎన్నికల్లో భారీ మోసం జరిగిందని ఆరోపించారు.