తానాలో కొత్తగా చేరిన మెంబర్లకు ఓటింగ్ హక్కు ఇచ్చేందుకు గతంలో బోర్డ్ నిరాకరించడంతో దీనిపై వివాదం చెలరేగి ముగ్గురు సభ్యులు నాలుగైదు నెలల క్రితం కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. దీనిపై మేరీలాండ్ కోర్టు చర్చించి వివాదపరిష్కారంకోసం ఆర్బిట్రేషన్ ఏర్పాటు చేసింది. తానా బోర్డ్ కూడా దీనిపై కోర్టులో తనవాదనలు వినిపించేందుకు దాదాపు రెండు లక్షల డాలర్లను ఖర్చుపెట్టింది. చివరకు తానా బోర్డ్ వివాదానికి ముగింపు పలుకుతూ కోర్టుకెక్కిన ముగ్గురికి సింపుల్ మెజారిటీతో ఓటింగ్ హక్కును ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు బోర్డ్ దీనిపై ఎటూ తేలకుండా నాన్చడం వల్ల తానాకు అనవసరంగా రెండు లక్షల డాలర్లు ఖర్చయిందని, ఆ ఓటింగ్ హక్కును ఆనాడే ఇచ్చేసి ఉంటే డబ్బులు మిగిలి ఉండేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇందులో గెలిచిందెవరు అంటే కోర్టుకెక్కిన ముగ్గురేనని చెబుతున్నారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళడం వల్లనే ఓటింగ్ హక్కు ఇవ్వనన్న బోర్డ్ కోర్టులో తీర్పు ఎలా ఉంటుందోనన్న అనుమానంతో వారికి ఓటు హక్కు ఇచ్చింది. అందువల్ల కోర్టుకు వెళ్ళిన ముగ్గురిదే విజయం తప్ప బోర్డ్‌ది కాదని అంటున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-211.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/45af6911-9449-466d-a7e1-ba146800284b-158.jpg)
ఇది ఇలా ఉండగా 33 వేల మంది సభ్యుల ఓటు హక్కు క్లాస్ యాక్షన్ కేసు ఇంకా న్యాయ వ్యవస్త పరిధిలోనే వుంది. ఇప్పటికైనా తానా బోర్డు కళ్ళు తెరుచుకుని ఈ 33 వేల మంది సభ్యుల కి ఓటు హక్కు ఇవ్వటంతో పాటు తానా దాతల డబ్బులు ఆదా చేస్తుందని ఆశిద్దాం !!!
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/638bff07-efd2-4cc9-8546-98039833db3c-165.jpg)