Namaste NRI

ఆ వైరస్‌ పుట్టుక అమెరికాలోనే.. కానీ

 కొవిడ్‌-19 వైరస్‌ పుట్టుకపై అమెరికా-చైనా పరస్పర ఆరోపణలకు దిగుతున్నాయి. కొవిడ్‌-19 వైరస్‌ తొలుత అమెరికాలోనే ఉద్భవించిందని చైనా తాజాగా ఎదురుదాడికి దిగింది. ఈ అంశంపై చైనా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. వైరస్‌ పుట్టుక అమెరికాలోనే ఉందని, కానీ అమెరికా, అక్కడి ప్రభుత్వం సార్స్‌-కోవ్‌-2 మూలాల జాడపై సిగ్గు లేకుండా రాజకీయం చేస్తున్నాయని నివేదిక ఆరోపించింది.

దీనికంటే ముందు కొవిడ్‌-19 వైరస్‌ పుట్టుకపై అమెరికా ఏప్రిల్‌ 18న ఒక వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది. కొవిడ్‌ సంక్షోభం ప్రకృతి విపత్తుకాదు, మానవుడు సృష్టించినదని ఆ వెబ్‌సైట్‌లో పేర్కొన్నది. దీనిని ఖండిస్తూ చైనా తాజాగా శ్వేతపత్రం విడుదల చేసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events