Namaste NRI

బ్రిటన్‌ ప్రధాని భారత్‌ పర్యటన ఖరారు.. షెడ్యూల్‌ ఇదే

బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ భారత్‌ పర్యటన ఖరారైంది.  ఏప్రిల్‌ 21, 22 తేదీలో బోరిస్‌ పర్యటన ఉంటుందని  కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.  21 ముందుగా ఆయన అహ్మదాబాద్‌కు చేరుకుని అక్కడి నుంచి ఢల్లీికి బయల్దేరనున్నారు. అనంతరం ఏప్రిల్‌ 22న రాజ్‌ఘాట్‌కు వెళ్లి గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు. అనంతరం విదేశాంగ మంత్రి ఎస్‌.జయశంకర్‌తో కలుసుకోనున్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై తిరిగి లండన్‌ వెళ్లనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడిరచింది.

                బ్రిటన్‌ ప్రధానమంత్రిగా బోరిస్‌  ఇంత వరకు భారత్‌కు రాలేదు. అంతే కాదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం బోరిస్‌ ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి బ్రిటన్‌కు వెళ్లలేదు. ఆయన గతంలోనే భారత్‌కు రావాల్సి  ఉంది. గతేడాది జనవరిలో సైతం గణతంత్ర దినోత్సవానికి భారత్‌ ఆహ్వానించగా బ్రిటన్‌లో కరోనా పెరుగుదల కారణంగా వాయిదా పడిరది. అనంతరం మళ్లీ భారత పర్యటన ఖరారైంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events