Namaste NRI

వృషభ టీజర్ వచ్చేసింది

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ నటిస్తున్న తాజా చిత్రం వృషభ. నందకిషోర్‌ దర్శకత్వం. గురువారం టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో విజువల్స్‌తో పాటు యాక్షన్‌ ఘట్టాలు అబ్బురపరిచేలా ఉన్నాయి. ఈ కథలో బలమైన భావోద్వేగాలు, ప్రతీకార నేపథ్యం, స్వేచ్ఛ కోసం ఓ వ్యక్తి చేసే పోరాటం ప్రధానాంశాలుగా ఉంటాయని, ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్‌ అనుభూతినందిస్తుందని నిర్మాత ఏక్తాకపూర్‌ తెలిపారు. తండ్రీకొడుకుల చుట్టూ తిరిగే బలమైన కథ ఇదని దర్శకుడు నందకిషోర్‌ తెలిపారు. మలయాళంతో పాటు తెలుగులో ఏకకాలంలో చిత్రీకరణ జరిపామని మేకర్స్‌ చెప్పారు. ఈ కథలో పునర్జన్మల అంశం కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో దీపావళికి ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News