తమ దేశాన్ని పొగ రహితంగా మార్చేందుకు బ్రిటన్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందుకోసం భవిష్యత్తు తరం సిగరెట్లు వినియోగించకుండా వాటి అమ్మకంపై త్వరలో నిషేధం విధించేందుకు ప్రణాళికలు రచిస్తోం దని బ్రిటన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడిరచాయి. 15ఏళ్లు, ఆ లోపు వయస్సు ఉన్నవారు ధూమపానం చేయకుం డా నిషేధం విధించాలన్న తన ప్లాన్లకు బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు. ఆ వయో వర్గంవారిపై ధూమపాన నిషేధానికి ఉద్దేశించిన కొత్త బిల్లు కామన్స్ సభలో వోటింగ్‌కు రానున్నది. బ్రిటిష్ ఇండియన్ నేత అయిన రిషి సునాక్ నిరుడు టొబాకో, వేప్స్ బిల్ ను ప్రతిపాదించారు. 15 ఏళ్ల పిల్లల కు వర్తింపజేస్తూ 2009 జనవరి 1 తరువాత జన్మించిన ఎవరికైనా పొగాకు ఉత్పత్తుల విక్రయాన్ని ఒక నేరంగా చేయడం ద్వారా ధూమపానరహిత తరం సృష్టించాలన్నది తన కల అని ఆయన ప్రకటించారు.