కె.శ్రీదేవి సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ మీద కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్న చిత్రం తెల్ల కాగితం. హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటిస్తున్న ఈ సినిమాకి కథ, స్క్రీన్ప్లే, మాటలు నందు సవిరిగాన అందిస్తున్నారు. ఈ మూవీకి రమేష్ బండ్రెడ్డి దర్శకుడు. ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు నిర్మాత, టీఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, స్టార్ డైరెక్టర్లు అనిల్ రావిపూడి, కొరటాల శివ, చందు మొండేటి, వశిష్ట, శైలేష్ కొలను, రామ్ జగదీష్, నిర్మాత బండ్ల గణేష్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ గతంలో మా బ్యానర్ నుంచి వచ్చిన కొత్త బంగారు లోకం సినిమాలో ఎలాంటి అమాయకత్వంతో కూడిన ప్రేమకథ ఉందో, ఇందులోనూ అలాంటి ఫీల్ కనిపించిందని తెలిపారు. హీరో హర్ష రోషన్ మాట్లాడుతూ ఈ సినిమా చూసి బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడు ఒక మంచి అనుభూతితో వస్తాడని నమ్ముతున్నానని తెలియజేశారు. మూవీ డైరెక్టర్ రమేష్ బండ్రెడ్డి మాట్లాడుతూ హీరో రోషన్ సినిమాను తన భుజాలపై మోశాడు. హీరోయిన్ నక్షత్ర నటనలో జీవించేసింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నక్షత్ర. నందు సవిరిగాన, రఘురామ్, సురేష్ బానిశెట్టి, పూర్ణాచారి, శ్రావ్య, దీపక్, సంతోష్ పాల్గొన్నారు.















