Namaste NRI

అప్పుడు కలిసి ఉండటం కంటే.. విడిపోవడం బెటర్‌ ..  తమన్నా

పెళ్లి కాకముందే బెస్ట్‌ కపుల్స్‌ అనిపించుకున్నారు తమన్నా, విజయ్‌వర్మ. అయితే, ఇప్పుడు హటాత్తుగా ఇద్దరూ విడిపోయారనే వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే,  ఈ విషయాన్ని వారు మాత్రం ధృవీకరించలేదు. ఇటీవలే ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ తమన్నా మాట్లాడిన మాటలు  వారి బ్రేకప్‌కు బలాన్నిస్తున్నాయి. ప్రేమలో స్వేచ్ఛ ఉండాలి. కట్టడి ఉండకూడదు. ప్రేమలో ఎమోషన్స్‌ ఉండాలి. అంచనాలు ఉండకూడదు. అలా వుంటే అది ప్రేమకాదు. వ్యాపారం అవుతుంది. ఎప్పుడైతే ప్రేమ వ్యాపారంలా మారుతుందో , అప్పుడు కలిసి ఉండటం కంటే విడిపోవడం బెటర్‌  అంటూ స్పందించింది తమన్నా. ఆమె మాటలు విన్న వారంతా బ్రేకప్‌ విషయంపై ఓ అభిప్రాయానికి వచ్చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events