Namaste NRI

ఆ ఇంట్లో ఐదుగురు కలెక్టర్లే… ఎక్కడో తెలుసా?

ఒక ఇంట్లో ఒకరు కలెక్టర్‌ అయితే వీధి వీధి సంబంరాలు, ఏరియా అంతా హంగామా మామూలుగా ఉండదు అదే ఆ ఇంట్లో వారంతా కలెక్టర్లుగా అయితే కుటుంబానికి ఆనందానికి హద్దులే ఉండవు కదా. అటువంటి అరుదైన కుటుంబం సహదేవ్‌ సహరన్‌. ఆయన మధ్య తరగతి కుటుంబానికి చెందిన రైతు. ఆయనకు ఐదుగురు ఆడపిల్లలు. రోమా, మంజు, అన్షు రీతు, సుమన్‌, అని నామకరణం చేశారు. అయితే తనకు కలెక్టర్‌ కావాలన్న కోరిక ఉండగా ఆ విషయాన్ని తన కుమార్తెలకు చెప్పారు. తన మనసులోని మాట బయటపెట్టారు. దీంతో తండ్రిని అర్థం చేసుకున్న తనయులు ఎంతో కష్టపడి చదివారు. ఐదుగురు ఆడపిల్లలు ఉన్న చదువులు చదవడమే కాకుండా కలెక్టర్లుగా ఎంపికయ్య తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చి యువతకు ఆదర్శ ప్రాయంగా నిలిచారు.

                రాజస్థాన్‌లోని హనుమాఘర్‌లో 2018లో నిర్వహించిన రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్ష ఫలితాలు ప్రకటించగా.. అన్షు, రీతు, సుమన్‌లకు రాజస్థాన్‌ అడ్మినిస్ట్రేషన్‌ సర్వీస్‌ కు ఏకకాలంలో ఎంపికై అందరన్ని ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా.. తమ వైపుకు దృష్టిని ఆకర్షించేలా చేశారు ఈ యువతులు. ఇప్పటికే ఆ ఇంట్లో రోమా, మంజులు కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. తాజాగా ఈ ముగ్గురు కూడా ఆర్‌ఎఎస్‌కు ఎంపిక కావడంతో ఆ ఇంట్లో ఇప్పుడు అందరూ కలెక్టర్లుగా ఉండటం విశేషం. ఆర్‌ఎఎస్‌కు ఎంపికైన ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఫొటోలను ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి పర్వీన్‌ కష్వాన్‌ షేర్‌ చేయడంతో అందరికీ ఈ విషయం తెలిసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress