శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం అల్లూరి. కయాదు లోహర్ కథానాయిక. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ప్రదీప్ వర్మ దర్శకుడు. ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇవాళ చిన్నా, పెద్దా తేడా లేదు కేవలం మంచి చిత్రాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అని అన్నారు. పాండమిక్ తర్వాత సినిమా స్వరూపం మారిపోయింది. మంచి చిత్రాల టైమ్ నడుస్తున్నది. అవే ఆదరణ పొందుతున్నాయి. శ్రీవిష్ణు నటుడిగా ఎప్పుడూ వినూత్న ప్రయత్నాలు చేస్తాడు. సినిమా కోసం కష్టపడతాడు. అతనంటే నాకు ప్రత్యేక అభిమానం. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలి అన్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ పోలీస్ కథల్లో ఎంత కిక్ ఉంటుందో, నా సినిమాతో కూడా అంతే కిక్ వస్తుంది అన్నారు. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ గొప్ప పోలీసుల స్ఫూరితో చేసిన చిత్రమిది. ఈ సినిమా చూశాక పోలీస్ లకు సెల్యూట్ చేస్తారు అన్నారు. ఈ చిత్రం నెల 23న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ వర్మ, కయాదు లోహార్, హర్ష వర్థన్ రామేశ్వర్, రాంబాబు గోసాల, చదలవాడ శ్రీనివాసరావు, టి.ప్రసన్నకుమార్, తనికెళ్ల భరణి, రామసత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)