Skip to main content

Namaste NRI

వెనక్కి తగ్గేది లేదు.. అప్పటి వరకు యుద్ధం

మా లక్ష్యాలు నెరవేరేవరకు ఈ దాడి ఇలాగే కొనసాగుతుందని వెనక్కి తగ్గే ఉద్దేశం లేదని రష్యా దేశ రక్షణ మంత్రి సెర్గీ షోయిగుయే స్పష్టం చేశారు. నిర్దిష్ట లక్ష్యాలు సాధించే వరకు రష్యన్‌ సాయుధ దళాలు ఈ ప్రత్యేక  సైనిక చర్యను కొనసాగిస్తాయని అన్నారు. ఉక్రెయిన్‌ను నిస్సైనికీరణ చేయడం, అక్కడి నాజీ తత్వాన్ని పారదోలడమే మాస్కో లక్ష్యం అన్నారు. పశ్చిమ దేశాలు సృష్టిస్తోన్న సైనిక ముప్పు నుంచి రష్యాను రక్షించుకోవడం మా ప్రథమ ప్రాధాన్యం అని అన్నారు.  యూరోపు నుంచి అణ్వాయుధాలను అమెరికా ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు.  లక్ష్యాలు నెరవేరే వరకు ఉక్రెయిన్‌లో సైనిక కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు.

Social Share Spread Message

Latest News