Skip to main content

Namaste NRI

లొంగిపోయే ప్రసక్తే లేదు … చర్చలకు సిద్ధంగా ఉన్నాం

ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్‌ లొంగిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే వివాదానికి ముగింపు పలికేందుకు దౌత్యమే మార్గమని చెప్పారు. ఇరాన్‌ అణు కార్యక్రమంపై తమ హక్కులను వదులుకునే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన ఐరాస ప్రసంగంలో ఇరాన్‌పై యుద్ధాన్ని సమర్థిస్తూ, ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌ను పూర్తిగా ధ్వంసం చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పెజెష్కియాన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఇరాన్‌కు శాంతియుత అణు సాంకేతికతను వినియోగించుకునే హక్కు ఉందని పెజెష్కియాన్‌ అన్నారు. అదే సమయంలో అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని స్పష్టం చేశారు. అణ్వాయుధాలు వద్దని, కానీ శాంతియుత అణు సాంకేతికతపై పరిమితులను అంగీకరించబోమని తెలిపారు. ఇతర దేశాల అనుమతి తీసుకోకుండా తనను తాను రక్షించుకునే హక్కు ఇరాన్‌కు ఉందన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events