ధాన్యం కొనుగోలుకు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని టీఆర్‌ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు నాగరాజు గుర్రాల డిమాండ్ చేశారు. ఢల్లీిలో టీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన రైతు దీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే తెలంగాణ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నారు. రైతులని మోసం చేస్తున్న కేంద్రం త్వరలోనే దాని పర్యవసానాలు చూస్తుందన్నారు. ధాన్యం కొనాలని ఒక రాష్ట్ర ప్రభుత్వ దేశ రాజధాని ఢల్లీిలో పోరాడడం కేంద్రానికి సిగ్గు చేటని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన 24 గంటల ధాన్యం సేకరణ డెడ్‌లైన్ పై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల తరపున నిరసనలో పాల్గొన్న అందరికి ధన్యవాదాలు తెలిపారు.














