భారత్, పాక్ మధ్య నిర్మాణాత్మక చర్చలు జరగాలని, తద్వారా ఇరు దేశాల మధ్య ప్రజలకు మేలు జరుగుతుందని యూఎస్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు. ఇరుదేశాల మధ్య మాటల యుద్ధం వద్దని ఆయన సూచించారు. ఇరుదేశాలతో అమెరికాకు సంబంధాలున్నాయని అన్నారు. పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంటూ పాక్‌తో భారత్ చర్చలు జరుపని విషయం తెలిసిందే. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాదాన్ని అంతం చేసే వరకు పాక్‌తో చర్చలుండవని స్పష్టం చేశారు. ఆ తర్వాత పాక్‌తో ద్వైపాక్షిక సంబంధాలు సైతం తెగిపోయాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)