రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతియుత వాతావరణం నెలకొనడానికి తాము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రష్యాలోని వ్లాడివోస్తోక్‌లో నిర్వహించిన ఈస్ట్రన్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఆన్లైన్ ద్వారా పాల్గొని ప్రధాని మోదీ ప్రసంగించారు. రష్యాతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సిద్ధంగా ఉన్నామని ఇంధన రంగంలో పరస్పర సహకారానికి అవకాశాలున్నాయని తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైనప్పట్నుంచి చర్చల ద్వారా శాంతి యువత పరిష్కారం జరగాలనే భారత్ గట్టిగా చెబుతోందని గుర్తు చేశారు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనడానికి తాము మద్దతునిస్తామని చెప్పారు. ప్రపంచమంతా ఒక్కటే కుటుంబంగా మారిపోవడంతో ఎక్కడ ఏం జరిగినా యావత్ ప్రపంచంపై దాని ప్రభావం పడుతోందని మోదీ అన్నారు. దీనికి ఉక్రెయిన్ యుద్దం, కరోనాయే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ సదస్సుకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా హాజరయ్యారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)