అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం చెలరేగింది. దక్షిణ ఉటా ప్రావిన్స్‌లోని ఇనాక్ సిటీలోని ఓ ఇంట్లో 8 మంది చనిపోయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సాల్ట్‌లేక్ సిటీకి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణంలో కాల్పులు జరగడం వల్ల వీరంతా చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలపై బుల్లెట్లు దిగిన ఆనవాళ్ల ఉన్నాయి. పోలీసుల తనిఖీల సందర్భంగా మృతదేహాలు బయటపడ్డాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మృతుల్లో ఐదుగురు చిన్నపిల్లలు ఉన్నారని, ఎవరు కాల్చి చంపారనేది తెలుసుకునేందుకు ఉటా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
ఎనిమిది మృతదేహాలు లభించిన వార్తలతో పట్టణ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారని, మరణించిన వారందరూ ఒకే కుటుంబ సభ్యులని ఎనోచ్ సిటీ మేనేజర్ రాబ్ డాట్సన్ మీడియాకు తెలిపారు. ఉటా గవర్నర్ స్పెన్సర్ కాక్స్ ట్విట్టర్ ద్వారా తన సంతాప సందేశం పంపారు. చనిపోయి గుర్తించిన ఐదుగురు చిన్నారులు ఐరన్ కౌంటీ స్కూల్‌లో చదివి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు