విదేశీ ప్రయాణికులకు కువైత్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణికులకు కరోనా ఆంక్షలను తొలగించింది. జర్నీకి ముందు, అరైవల్ సమయంలో పీసీఆర్ టెస్టు అవసరం లేదని పేర్కొంది. ఫిబ్రవరి 20 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఎం. తారిఖ్ అల్ ముజ్రం వెల్లడిరచారు. 7 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో మాత్రం ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ క్వారంటైన్‌ను ముందే ముగించాలనుకుంటే పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు చూపిస్తే సరిపోతుందని తెలిపారు. వ్యాక్సినేషన్ పూర్తికాని ప్రయాణికులకు మాత్రం ప్రయాణానికి 72 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ పరీక్ష నెగెటివ్ సర్టిఫికేట్ చూపించడం తప్పనిసరి అని తెలిపింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)