రవితేజ, దర్శకుడు హరీశ్‌శంకర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మించనుంది. టి.జి. విశ్వ ప్రసాద్ నిర్మాత. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాని ఈ రోజు అధికారికంగా అనౌన్స్ చేశారు. హీరోయిజాన్ని అద్భుతంగా ఆవిష్కరించడంలో హరీశ్‌శంకర్ దిట్ట. మరి మాస్‌మహారాజైన రవితేజను ఆయన ఎలా చూపించనున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. ఈ సినిమా మాస్‌ని లక్ష్యంగా చేసుకొని తెరకెక్కనున్నదని తెలియజేయటానికి ఈసారి మాస్ రీయూనియన్ స్పైసీగా ఉంటుంది’ అని కేప్షన్‌తో సినిమా ఎనౌన్స్‌మెంట్ స్టిల్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)