మా విదేశాంగ మంత్రి జోసఫ్ వూని భారత ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూ చేస్తే చైనాకు అభ్యంతరం దేనికని తైవాన్ ప్రశ్నించింది. భారత్, తైవాన్ దేశాలు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో అంతర్భాగాలు కావని ఘాటుగా వ్యాఖ్యానించింది. చైనాకు తాము కీలు బొమ్మలం కాదని స్పష్టం చేసింది. పత్రికా స్వేచ్ఛ భారత్, తైవాన్ రెండు దేశాల ప్రజాస్వామ్యాల్లో ఉన్నదని తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. అంతేగాక, చైనా పొరుగు దేశాలను వేధించడం మానుకుని, తమ ఆర్థిక వ్యవస్థ కుంగిపోతుండటంపై ఆందోళన చెందాలని తైవాన్ హితవు పలికింది.