తమ దేశ విద్యుత్ కేంద్రాలను, ఇతర మౌలికసదుపాయాలను ఉక్రెయిన్ లక్ష్యం చేసుకుంటే మాత్రం తాము మరింత తీవ్రస్థాయిలో దాడులు జరుపుతామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. షాంఘై సహకర సంస్థ (ఎస్‌సీఓ) సమావేశానికి హాజరైన పుతిన్ మీడియాతో మాట్లాడారు. మొత్తం డాన్‌బాస్ ప్రాంతాన్ని విముక్తి చేయడమే తాము చేపట్టిన సైనిక చర్య ఉద్దేశమని అన్నారు. ఈ విషయంలో తాము తొందరపడటం లేదని అన్నారు. ప్రస్తుతానికి వాలంటీర్ సైనికులను మాత్రమే యుద్ధ రంగంలోకి దింపామని పేర్కొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)