Namaste NRI

భార‌త్‌తో ప‌నిచేసేందుకు తాము సిద్ధం

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన ఎన్డీఏ కూట‌మి నేత ప్ర‌ధాని మోదీకి డ్రాగ‌న్ దేశం చైనా  కంగ్రాట్స్ చెప్పింది. ద్వైపాక్షిక సంబంధాల‌ను గుర్తుంచుకుని, ఇండియాతో మైత్రిని కొన‌సాగించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు చైనా తెలిపింది. భార‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ప‌రిశీలించామ‌ని, ప్ర‌ధాని మోదీ, ఎన్డీఏకు కంగ్రాట్స్ చెప్పామ‌ని చైనా విదేశాంగ మంత్రి మావో నింగ్ తెలిపారు. భార‌త్‌తో బ‌ల‌మైన‌, స్థిర‌మైన రిలేష‌న్ ఇరు దేశాల‌కు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంద‌ని, ఈ ప్రాంతంలో శాంతి, అభివృద్ధికి కూడా స‌హ‌క‌రిస్తుంద‌ని చైనా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. రెండు దేశాల ప్రాథ‌మిక ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకుని భార‌త్‌తో ప‌నిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్న‌ట్లు చైనా ప్ర‌తినిధి తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events