ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడ్డ నూతన ప్రభుత్వంలో మొత్తం 25 మంది మంత్రులు గా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కల్యాణ్ మరో 22 మంది ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు.
ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు వీరే…
కొణిదెల పవన్ కల్యాణ్, నారా లోకేశ్, కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, అనిత వంగలపూడి, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామా నాయుడు, ఎన్ఎండి ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారిథి, డోలా బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బిసి జనార్ధన్ రెడ్డి, టిజి భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాస్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి.
25మందిలో 17 మంది కిపైగా కొత్తవారికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు. ముగ్గురు మహిళలు, ఎనిమిది మంది బీసీలు, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లకు అవకాశం కల్పించారు. మరో స్థానాన్ని ఖాళీగా ఉంచారు.