Namaste NRI

తాము యుద్ధాని కోరుకోవడం లేదు… కానీ

 చైనా మిలిటరీ విన్యాసాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని తైవాన్‌ రక్షణ శాఖ తెలిపింది. యుద్ధం వంటి పరిణామాలనైనా ఎదుర్కోడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. అయితే అటువంటి పరిస్థితులను తాము కోరుకోవడం లేదని తెలిపింది. ఘర్షణలను రెచ్చగొట్టి వివాదానికి కారణం అవడం తమ విధానం కాదని స్పష్టం  చేసింది. కాగా చైనా సైనిక విన్యాసాల నేపథ్యంలో తైవాన్‌ మారీటైమ్‌, పోర్ట్‌ బ్యూరో పలు నౌకలకు హెచ్చరికలు జారీ చేసింది. డ్రాగన్‌ డ్రిల్స్‌ జరుపుతున్న మర్గాలను వదిలి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించింది.  చైనా చర్యల కారణంగా 18 అంతర్జాతీయ మార్గాల్లో రాకపోకలకు అంతరాయం కలిగిందని తైవాన్‌ కేబినెట్‌ మండిపడిరది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events