తమది చైనా కంపెనీ కాదని, తమకు చైనాతో ఏ సంబంధం లేదని బైనాన్స్ క్రిప్టో ఎక్స్‌ఛేంజ్ సీఈవో జాంగ్‌పెంగ్ జావో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బైనాన్స్ అనేది చైనా కంపెనీ అంటూ వస్తోన్న వార్తలపై ఆయన స్పందించారు. బైనాన్స్ అనేది చైనా కంపెనీ కాదు. నేను పదే పదే ఈ విషయాన్ని చెప్తున్నాను. ఎందుకంటే నేను చూడ్డానికి చైనీయుడిలాగా ఉంటాను. కానీ, గత 30 ఏళ్లుగా కెనడాలో నివసిస్తున్నాను అని జాంగ్ పెంగ్ తెలిపారు. అంతేకాదు భవిష్యత్‌లో ఇదే విషయాన్ని తాను ఎన్నిసార్లు చెపాల్సిన వచ్చినా ఆశ్చర్యపోనని అన్నారు.
