Skip to main content

Namaste NRI

47 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కలిశారు… మరి హీరో ఎవరు?

భారతీయ సినిమా లివింగ్‌ లెజెండ్స్‌ కమల్‌హాసన్‌, రజనీకాంత్‌ 47 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కలిసి నటించబోతు న్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక సినిమా అప్‌డేట్స్‌ కోసం యావత్‌ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తాలూకు అధికారిక ప్రకటన వెలువడింది. రెడ్‌ జాయింట్‌ మూవీస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రానికి కెహెచ్‌ & ఆర్‌కే అనే వర్కింగ్‌ టైటిల్‌ను పెట్టారు. 70వ దశకంలో రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ కలిసి నటించారు. అనంతరకాలంలో వారిద్దరూ భారతీయ సినిమాలో తిరుగులేని స్టార్‌డమ్‌తో లెజెండ్స్‌గా ఎదిగారు.

ఈ సందర్భంగా రెడ్‌ జాయింట్‌ మూవీస్‌ ప్రతినిధి మాట్లాడుతూ ఇదొక చారిత్రక ఘట్టం. ఇద్దరు దిగ్గజ నటులతో సినిమా చేయటం గొప్ప బాధ్యతగా భావిస్తున్నాం. మా కల నిజమైన అనుభూతి కలుగుతున్నది. భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం అన్నారు. ఈ సినిమాకు అనిరుధ్‌ సంగీతాన్నందిస్తున్నారు.

Social Share Spread Message

Latest News