Namaste NRI

ఈ సినిమాకు వారు దూరంగా ఉండండి : విశ్వక్‌సేన్‌

విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ కల్ట్‌. తారక్‌ సినిమాస్‌ పతాకంపై సందీప్‌ కాకరాల నిర్మిస్తున్నారు.ఇండియన్‌ తొలి స్లాషర్‌ జానర్‌ (హింస, రక్తపాతంతో కూడిన) మూవీగా వాస్తవ సంఘటనల ప్రేరణతో ఈ చిత్రాన్ని రూపొందించారు.  టీజర్‌ను లాంచ్‌ చేశారు. గోవా పబ్‌లో పార్టీ హోస్ట్‌ మొదలుపెట్టే ఓ ప్రాణాంతకమైన ఆటలో ఓ మిత్రబృందం ఎలా చిక్కుకుంది? ఒక్కొక్కరిని హతమారుస్తూ ముందుకుసాగే ఈ కథలో అసలు గేమ్‌ మాస్టర్‌ ఎవరు? అతను రక్షకుడా? ప్రమాదకారుడా? అనే ప్రశ్నలతో టీజర్‌ ఆసాంతం ఉత్కంఠను పంచింది.

ఈ సందర్భంగా విశ్వక్‌సేన్‌ మాట్లాడుతూ మీరు నా నుంచి ఏం కోరుకుంటున్నారో, ఏం మిస్‌ అవుతున్నారో అనే విషయాలన్నింటిని నేను గమనిస్తున్నా. ఫలక్‌నుమా దాస్‌ తీయకముందు నాలో ఓ కసి ఉండేది. ఈ సినిమాకు ముందు అది పదింతలు పెరిగింది. పిల్లలు, సున్నిత మనస్కులు ఈ సినిమాకు దూరంగా ఉండండి అన్నారు ఈ సినిమాలో వందమంది కొత్త నటీనటులున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర మాటల రచయిత తరుణ్‌భాస్కర్‌, సంగీత దర్శకుడు రవిబస్రూర్‌తో పాటు చిత్ర ప్రధాన తారాగణమంతా పాల్గొన్నారు. గాయత్రీ భరద్వాజ్‌, తారక్‌ పొన్నప, మురళీశర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, నిర్మాత, దర్శకత్వం: విశ్వక్‌సేన్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events