తన భర్త, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మానసిక ఆరోగ్యం, జ్ఞాపకశక్తిపై వ్యాఖ్యలు చేసిన ప్రత్యేక న్యాయవాదిపై జిల్ బైడెన్ మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం తమ కుమారుడి మరణాన్ని ఉపయో గించుకున్నారని దుయ్యబట్టారు. పౌరుడిగా ఉన్నప్పుడు కొన్ని రహస్య పత్రాలను బైడెన్ సరిగా నిర్వహిం చలేదని ప్రత్యేక న్యాయవాది రాబర్ట్ హర్ ఇటీవల ఒక నివేదిక ఇచ్చారు. దీనికి సంబంధించి ఎలాంటి అభియోగాలు నమోదు చేయవద్దని సూచించారు. ఇదే సమయంలో బైడెన్ మానసిక ఆరోగ్యం, జ్ఞాపకశక్తి గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బైడెన్‌కు ఆయన కుమారుడి మరణించిన తేదీ కూడా గుర్తు లేదన్నారు. దీనిపై జిల్ తన మద్దతుదారులకు తాజాగా ఈమెయిల్ పంపారు. కుమారుడి మరణం అంశం ఎన్నడూ బైడెన్‌ను వీడదు. ఆ వ్యాఖ్యలు జో భార్యగానే కాక బౌ (కుమారుడు) తల్లిగా కూడా నన్ను ఎంత బాధించి ఉంటా యో మీరు అర్థం చేసుకోగలరనుకుంటున్నా అని వ్యాఖ్యానించారు. తమ కుమారుడు 2015 మే 30న క్యాన్సర్ తో చనిపోయాడని, ఆ విషాదకర రోజును తాము ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. బైడెన్ వయసు 81 ఏళ్లు అయినప్పటికీ ఎంతోమంది కన్నా చాలా ఎక్కువగా ఆయన పనిచేస్తున్నారు. ఆయన అనుభవం, నైపుణ్యం అద్భుత వనరులని తెలిపారు. కొవిడ్ కోరల నుంచి ఆయన దేశాన్ని బయటకు తెచ్చి, అభివృద్ధి పథంలో నిలిపారని కొనియాడారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)