విశ్వక్సేన్ నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ లైలా. ఇందులో ఆయన సోను మోడల్, లైలాగా డిఫరెంట్ గెటప్స్లో కనిపించనున్నారు. లైలా పాత్ర తాలూకు లుక్స్ ఇప్పటికే సినిమాపై ఆసక్తిని పెంచాయి. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సాహు గారపాటి నిర్మాత. ఇప్పటికే మూవీ నుంచి టీజర్తో పాటు రెండు పాటలను విడుదల చేయగా, మంచి రెస్పాన్స్తో దూసుకుపోతున్నాయి.తాజాగా మూవీ నుంచి ఓహో రత్తమ్మ అనే థర్డ్ సింగిల్ను విడుదల చేశారు మేకర్స్. లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన ఈ పాటను పెంచల్దాస్ రచించడంతో పాటు మధుప్రియలో కలిసి ఆలపించారు. జానపది శైలిలో ఈ పాట సాగింది. దీనికి సోషల్మీడియాలో పాపులర్ అయిన కోయారే కోయ్ కోయ్ అనే ట్రాక్ను చేర్చడం వినోదాన్ని పండించింది. విశ్వక్సేన్ నృత్యాలు, కథానాయిక ఆకాంక్షశర్మ గ్లామర్ పాటలో ప్రధానాకర్షణగా నిలిచాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, దర్శకత్వం: రామ్నారాయణ్.