అమెరికాకు చెందిన జాయిస్ డెఫావ్ వయసు ప్రస్తుతం 90 ఏండ్ల. 1951లో ఈమె నార్తర్న్ ఇల్లినాయిస్ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సులో అడ్మిషన్ పొందింది. 1955లో ఆమెకు వివాహం జరగడం, ముగ్గురు పిల్లలు పుట్టడంతో చదువును పక్కన పెట్టాల్సి వచ్చింది. అయితే, అనుకోకుండా ఆమె మొదటి భర్త చనిపోవడంతో మళ్లీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మరో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది. మొత్తం తొమ్మిది మంది పిల్లల బాగోగుల నేపథ్యంలో చదువు జోలికి వెళ్లలేదు. ఈ క్రమంలోనే జాయిస్ వయసు 90ఏళ్లకు చేరింది. ప్రస్తుతం ఆమెకు 17 మంది మనవళ్లు, 24 మంది మునిమనవళ్లు ఉన్నారు.
అయినా చదువుపై జాయిస్‌కు ఇష్టం తగ్గలేదు. ఆ విషయం తన మునిమనవళ్లు మనవరాళ్లకు తెలిసింది. వాళ్లు కూడా జాయిస్‌ను ప్రోత్సహించారు. క్లాసులు కూడా ఆన్‌లైన్ అందుబాటులో ఉండటంతో మనవళ్లుమనవరాళ్ల సాయంతో కంప్యూటర్ ఉపయోగించి క్లాసులు వినడం నేర్చుకుంది. ఈ క్రమంలోనే కోర్సులో చేరి 71ఏండ్లు గడిచిన తర్వాత గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసి పట్టా అందుకుంది.