Namaste NRI

ఈ సినిమా మా అందరి నమ్మకాన్ని నిజం చేసింది:  కిరణ్‌ అబ్బవరం  

కిరణ్‌ అబ్బవరం  హీరోగా జైన్స్‌ నాని దర్శకత్వంలో రూపొందిన కె-ర్యాంప్‌  చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా  సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతు క మూవీ తర్వాత మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలే చేయాలని నిర్ణయించుకున్నా. ఈ సినిమా ద్వారా గొప్ప కథ చెప్పడం లేదు, కేవలం మిమ్మల్ని నవ్వించడమే లక్ష్యంగా సినిమా తీశామని విడుదలకు ముందే చెప్పాం. మిక్స్‌డ్‌ రివ్యూస్‌ వల్ల తొలిరోజు కాస్త నిరుత్సాహపడినా, ఆ తర్వాత పుంజుకున్నాం. ఇప్పుడు ప్రతీ షో ఫుల్‌ అవుతున్నది.ఈ సినిమా మా అందరి నమ్మకాన్ని నిజం చేసింది  అన్నారు.  

 తమ సంస్థలో అందరూ కలిసి చూసే సినిమాల్నే నిర్మిస్తామని, కె-ర్యాంప్‌ ఫ్యామిలీ ఆడియెన్స్‌ ఆకట్టుకుంటున్నదని నిర్మాత రాజేష్‌ దండా అన్నారు. కంటెంట్‌ బాగున్న చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనడానికి కె-ర్యాంప్‌ విజయమే నిదర్శనమని దర్శకుడు జైన్స్‌ నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్ర నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు శ్రీనువైట్ల, సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events